తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కళాకారులను గుర్తింపుః మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని అప్పన్నపల్లి గణేష్ మండపంలో శ్రీ శివ మారుతి భజన మండలి ఆధ్వర్యంలో అడుగుల భజన, అంజెల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి భజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాచీన కళలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారన్నారు. అంతరించిక పోతున్న కళలకు జీవం పోసిన కళాకారులను అభినందించారు మంత్రి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కళాకారులను గుర్తింపుః మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud

Updated on: Oct 22, 2023 | 6:56 PM

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని అప్పన్నపల్లి గణేష్ మండపంలో శ్రీ శివ మారుతి భజన మండలి ఆధ్వర్యంలో అడుగుల భజన, అంజెల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి భజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాచీన కళలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారన్నారు. అంతరించిక పోతున్న కళలకు జీవం పోసిన కళాకారులను అభినందించారు మంత్రి.

భవిష్యత్ తరాలకు ప్రాచీన కళల వారసత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కళాకారులను గుర్తించి ప్రత్యేక పెన్షన్లను అందించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గౌరవించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. శ్రీ శివ మారుతి భజన మండలి చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే భక్తి భావం పట్ల అవగాహన కల్పించడం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రజల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని అప్పనపల్లి బ్రిడ్జిని శరవేగంగా పూర్తి చేసామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం మన్నారు. చిన్నపిల్లలకు పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రేషన్ ద్వారా సన్న బియ్యం ను అందిస్తున్నామన్నారు. పెన్షన్లను దశలవారీగా రూ. 3000 నుండి రూ. 5000 వరకు పెంచుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు భరోసాగా నిలుస్తున్నారు. దేశంలో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…