Bird Flu: బర్డ్ ఫ్లూపై భయం వద్దు.. నిర్భయంగా తినొచ్చు.. మనుషులకు ఆ వ్యాధి రాదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

|

Jan 12, 2021 | 6:04 PM

Bird Flu: బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. గుడ్లు, చికెన్‌ను ప్రజలు నిర్భయంగా తినొచ్చని అన్నారు.

Bird Flu: బర్డ్ ఫ్లూపై భయం వద్దు.. నిర్భయంగా తినొచ్చు.. మనుషులకు ఆ వ్యాధి రాదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
talasani srinivas yadav
Follow us on

Bird Flu: బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. గుడ్లు, చికెన్‌ను ప్రజలు నిర్భయంగా తినొచ్చని అన్నారు. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో అక్కడక్కడ కోళ్లు చనిపోయాయని వార్తలొచ్చాయని ఉటంకించిన ఆయన.. అవి బర్డ్ ఫ్లూతో చనిపోలేదని ప్రకటించారు. చనిపోయిన కోళ్లకు పరీక్షలు నిర్వహించగా ఆ విషయం తేలిందన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదన్నారు. బర్డ్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తలసాని చెప్పుకొచ్చారు.

కరోనా వ్యాప్తి పేరుతో గత సంవత్సరమే ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా దెబ్బతిందన్నారు. ఇప్పుడు మరోసారి బర్డ్ ఫ్లూ అని ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. నిశ్చితంగా చికెన్, గుడ్లను ప్రజలు తినొచ్చని తెలిపారు. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదని, ఆ వ్యాధి మనుషులకు సోకిన దాఖలాలు కూడా లేవని ఆయన చెప్పుకొచ్చారు. వలస పక్షులతోనే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందితుదని చెప్పిన ఆయన.. తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు.

ఇదిలాఉండగా.. గత ఏడాది మార్చి నెలలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినేందుకు ప్రజలు వెనుకడుగు వేశారు. దాంతో కోళ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. కొందరు వ్యాపారస్తులు కోళ్లను ఫ్రిగా పంచిపెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరికొందరు వ్యాపారులు వేల సంఖ్యలో కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. కరోనా విజృంభన సమయంలో కోళ్ల వ్యాపారులు తీవ్రంగా నష్ట పోయారు. మళ్లీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాప్తితో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు హడలిపోతున్నారు. గత సంవత్సరం ఏర్పడిన నష్టాల నుంచే ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఉండగా.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాప్తితో మరోసారి ఫౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Also read:

తమిళనాడులో జల్లికట్టును చూసేందుకు రాహుల్ గాంధీ నిర్ణయం. రేపు మదురైకి ప్రయాణం. తమిళ కాంగ్రెస్ చీఫ్ అళగిరి

WHO about Covid 19 Vaccines: ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పరుగులు పెడుతున్న దేశాలు.. మరో వైపు షాకింగ్ న్యూస్ చెప్పిన WHO