విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని , తాము తెగించి కొట్లాడడం వల్లే కేంద్రం దిగివచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం పై వెనక్కి తగ్గిందన్నారు. సీఎం కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని గుర్తు చేశారు కేటీఆర్. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారు.. ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చన్నారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. ఆశ మాషిగా ఇక్కడున్న పేర్లు పథకాలకు పెట్టలేదు.. దళితులు తెలంగాణలో గొప్పగా ఎదుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే.. ప్రజాస్వామ్యంలో అందరికి ఒకే ఓటు హక్కు ఉందన్నారు. అదానీకైన, మనకైన ఒకటే ఓటు హక్కు ఉంటుందన్నారు. మతాలు, కులాలు మనకు మనం పుట్టించుకున్నవే.. రెండెకరాల స్థలాన్ని రేపు సీఎం కెసీఆర్ చేతుల మీదుగా దళిత గిరిజనులకు దండు మల్కాపూర్ లో డిక్కీ కు ఇప్పిస్తామన్నారు.
ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారం.. లేదంటే ఎవరైనా చెత్త బుట్టలో ఉండాల్సిందే అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దళిత బందు లాంటి పథకం కేసీఆర్ లాంటి దమ్ము నాయకుడు తోనే సాధ్యమన్నారు. రెండు మొక్కలు నాటమంటే ఎవరికి..,ఏ రాజకీయ నాయకుడికి చేత కాదన్నారు. అది కూడా కేసిఆర్ వల్లనే సాధ్యమైన్నారు.
64లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉమ్మడి రాష్ట్రం లో పండేది కానీ ఇప్పుడు 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు పండుతోందన్నారు. తెలంగాణ వచ్చాక ధరలు భారీగా పెరిగాయి. ఇంటింటికి వంద శాతం నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. గుజరాత్‌లో 12 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
ఏ పని చేసిన హేళన చేసేవాళ్ళు ఉంటారు.. ఎర్రటి ఎండల్లో కూడా రిజర్వాయర్‌లో నీళ్ళు నిండుకుండలా ఉన్నాయని.. నీళ్ళు వచ్చాయా, ఎక్కడున్నాయని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. నేను చూపిస్తా రమ్మంటే ఎవరు రారని .. పైకి మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
విశాఖ హక్కు గురించి కేసీఆర్, కేటీఆర్ , తాను మాట్లాడామన్నారు మంత్రి హరీష్ రావు. విశాఖ ఉక్కును అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నరు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నరు. దాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని.. కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ దెబ్బకు, బి ఆర్ ఎస్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గింది. కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించాడు.. బలోపేతం చేస్తాం అన్నారు. అక్కడి రెండు పార్టీలు నోరు మూసుకున్నా, ప్రజలు, కార్మికులు, బి ఆర్ ఎస్ పోరాటం చేసిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం