కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై తనదైన శైలిలో కౌంటర్ వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా అమిత్‌షాపై కౌంటర్ వేశారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్టకు హోదా, మెట్రో ఫేజ్-2, ఐఐఎం, ఐఐఊటీ, నవోదయాలు, మెడికల్ కాలేజీలకు, ఎన్‌ఐడీలకు శంకుస్థాపన చేసినందుకు వచ్చిన అమిత్ షాకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పైన పేర్కొన్న అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవేవీ సాకారం చేయలేదన్న అర్థం వచ్చేలా కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని కేటీఆర్ 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న.. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పేరు చెప్పలేదంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
I thank HM @AmitShah Ji on laying the foundation for
☑️ ITIR Hyderabad
☑️ National Project status for Palamuru – RR lift irrigation project
☑️ Hyderabad Metro Phase 2
☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing CollegesOh Wait ? he did none of that.
Amit…
— KTR (@KTRBRS) April 23, 2023
ఇదిలా ఉంటే అంతకు ముందు చేవెళ్లలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్‌పై ప్రశ్నించారని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు.
మరిన్నితెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..