Minister KTR: మధ్యప్రదేశ్‌లో కూడా మా పేరు వస్తుందంటే మేం ప్రాబల్యానికి సంకేతం.. టీవీ 9తో మంత్రి కేటీఆర్..

కేటీఆర్‌.. ఇది బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో వినిపించే తారకమంత్రం. పార్టీకి అధ్యక్షులుగా కేసీఆర్ ఉన్నా‌.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కారు స్టీరింగ్ చేతుల్లోకి తీసుకున్న డ్రైవర్‌ రాముడు కేడర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాల్లో విస్త్రృతంగా పర్యటిస్తూ.. కార్యకర్తలను 2023 ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వంలో మంత్రిగా.. ఇటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్‌ రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారంటోంది పార్టీ. అదే సమయంలో ప్రత్యర్థులకు టార్గెట్‌ కూడా అవుతున్నారు కేటీఆర్‌. కుటుంబ రాజకీయాలపై..

Minister KTR: మధ్యప్రదేశ్‌లో కూడా మా పేరు వస్తుందంటే మేం ప్రాబల్యానికి సంకేతం.. టీవీ 9తో మంత్రి కేటీఆర్..
Minister KTR

Updated on: Jun 27, 2023 | 7:46 PM

Minister KTR Exclusive interview: భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌ కుమార్తె బాగుపడుతుందన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. టీవీ 9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో కూడా మా పేరు వస్తుందంటే మేం ప్రాబల్యానికి సంకేతం అని ఆయన అన్నారు. అదానికి లాభం చేకూర్చాలంటే ప్రధాని మోదీకి ఓటేయండంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ప్రత్యర్ధుల మీద ఈడీ, సీబీఐ దాడులే వాళ్లకి తెలిసిన విద్య అంటూ విమర్శించారు. ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు చేశారా? నల్లధనం తీసుకొస్తాం అన్నారు.. తీసుకొచ్చారా..? అదానీకి మాత్రమే ఈయన భక్తుడు, బినామీ అని మేం అనలేమా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో మోదీ, హైదరాబాద్‌‍లో బోడీ, ఈడీ అంటూ విమర్శించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మదే ఎందుకు ఈడీ దాడులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఎందుకు దాడులు జరగవన్నారు. సోనియా, రాహుల్ గాంధీ మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.

ఇదిలావుంటే, కుటుంబ రాజకీయాల నుంచి ప్రాజెక్టుల దాకా కల్వకుంట్ల కుటుంబపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇటీవల లిక్కర్ స్కామ్‌లో కవిత చుట్టూ ఆరోపణలు రాగా.. 111 జీవో వెనక కేటీఆర్‌ హస్తం ఉందని విమర్శలున్నాయి. ఇక కేటీఆర్‌ రీసెంట్గా ఢిల్లీ టూర్‌ కూడా బీజేపీతో మైత్రి కోసమే అంటూ విపక్షాలు విరుచుకపడుతున్నాయి. నిజంగా బీజేపీతో బీఆర్ఎస్‌ స్నేహం చేయబోతుందా? వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరు? మళ్లీ గెలిస్తే సీఎం ఎవరు వంటి అంశాలపై మంత్రి కేటీఆర్ ఏమంటున్నారో తెలుసుకుందాం..

వీడియో కోసం ఇక్కడ చూడండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం