Minister KTR: దక్షిణాది రాష్ట్రాల గొంతు అణచివేస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

|

Sep 26, 2023 | 9:43 AM

కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు ప్రకటన చేసింది. అంటే జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా పెరగనున్నాయి. అయితే ఈ ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే డిలిమిటేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Minister KTR: దక్షిణాది రాష్ట్రాల గొంతు అణచివేస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Minister K Taraka Rama Rao
Follow us on

కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు ప్రకటన చేసింది. అంటే జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా పెరగనున్నాయి. అయితే ఈ ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే డిలిమిటేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ (కే తారక రామారావు), ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మందుగా ఎంపీ సీట్లలో రాష్ట్రాల వారీగా వచ్చే మార్పులను ఓ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌ను మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల కంటే 26 తగ్గబోతున్నట్టుగా ఉంది. అదే జరిగితే తీవ్రమైన ఉద్యమం తప్పదంటూ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతును నొక్కాలని చూస్తే.. ప్రజా ఉద్యమం తప్పదంటూ కేటీఆర్ హెచ్చరించారు. అన్ని విషయాలను కేంద్రం దృష్టిలో పెట్టుకుంటుందనీ.. న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. కేటీఆర్ ట్వీట్ ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రీట్విట్ చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశం అన్యాయం జరిగే అవకాశం ఉందని ఒవైసీ పేర్కొన్నారు.

జనాభా లెక్కల ప్రకారం భవిష్యత్తులో ఎంపీ సీట్లు పెరిగితే.. ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్ లాంటి మూడు నాలుగు రాష్ట్రాలే దేశ రాజకీయాలను శాసిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మిగిలిన చిన్నాచితకా రాష్ట్రాలన్నీ రాజకీయంగా బలం కోల్పోయి బలహీనంగా మారతాయి. ఇది దక్షిణాదికి శరాఘాతమవుతుందనే ఆందోళనను మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. దేశంలో 18 శాతం జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు.. దేశ జీడీపీలో 35 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తున్నా నోరు మెదపలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు నిధుల గురించి కానీ, హక్కుల గురించి కానీ పార్లమెంటులో గట్టిగా మాట్లాడే కొట్లాడే అవకాశం కూడా ఈ రాష్ట్రాలకు ఉండదని మేధావులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ఎంపీ సీట్ల కంటే యూపీ, బీహార్‌లోనే ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయంటూ గతంలోనే కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

డీలిమిటేషన్‌ అంటే ఏమిటీ?

జనాభా ప్రాతిపదికన. దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియను డీలిమిటేషన్‌ అంటారు. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియే డీలిమిటేషన్.. మారుతున్న జనాభా ప్రకారం ఆయా ప్రాంతాలకు జనాభా ప్రతిపాదికన చట్టసభల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే.. ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేయాలంటే ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన చేయాలి.. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలి. అయితే, 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా అది జరగలేదు.. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం జనాభా గణన చేపట్టినట్లు ఇటీవల కేంద్ర ప్రకటించిన నేపథ్యంలో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..