KTR: పదే పదే అవమానిస్తున్నారు.. ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం.. నిరసనలు తెలపాలని పిలుపు

Minister KTR on PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన (AP Bifurcation) తీరుపై, తెలంగాణ ఏర్పాటు తదితర అంశాలపై రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను

KTR: పదే పదే అవమానిస్తున్నారు.. ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం.. నిరసనలు తెలపాలని పిలుపు
Ktr

Updated on: Feb 08, 2022 | 10:30 PM

Minister KTR on PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన (AP Bifurcation) తీరుపై, తెలంగాణ ఏర్పాటు తదితర అంశాలపై రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) ఖండించారు. దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) పదే పదే అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ (KTR) మంగళవారం ట్విట్ చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను పదే పదే అవమానించడం ప్రధానమంత్రికే పూర్తిగా అవమానకరం అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

దీంతోపాటు ప్రధాని మోదీ వ్యాఖ్యల పట్ల రేపు అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని బీజేపీ దిష్టి బొమ్మలు దహనం చేసి, నల్లజెండాలతో నిరసన తెలపాలని సూచించారు.

ఇదిలాఉంటే.. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్‌ వివాదంపై కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేశారు. హిజాబ్‌ అంశం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగించిందంటూ పేర్కొన్నారు. ఈ వివాదం వెనుక అసలు వ్యూహం ఏమిటో అందరికీ తెలిసిందేనంటూ కేటీఆర్ బీజేపీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

Also Read:

Hyderabad News: అమ్మకు ప్రేమతో కొడుకు చేసిన గొప్పపని.. చూస్తే వావ్ అంటారు..!

కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలరవాణా విభాగంలో మొత్తం10,208 ఖాళీలు.. అప్పటి వరకు ఎదురుచూపే!