చుక్కా తనూజ సహా తెలంగాణ టాపర్స్ కు కేటీఆర్ విషెస్

|

Sep 13, 2020 | 12:50 PM

శుక్రవారం రాత్రి విడుదల చేసిన JEE మెయిన్ పరీక్షలో అత్యద్భుత ప్రతిభ చూపిన తెలంగాణ విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందించారు. వారి ప్రదర్శన మనందరినీ గర్వించేలా చేసిందన్న ఆయన..

చుక్కా తనూజ సహా తెలంగాణ టాపర్స్ కు కేటీఆర్ విషెస్
Follow us on

శుక్రవారం రాత్రి విడుదల చేసిన JEE మెయిన్ పరీక్షలో అత్యద్భుత ప్రతిభ చూపిన తెలంగాణ విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందించారు. వారి ప్రదర్శన మనందరినీ గర్వించేలా చేసిందన్న ఆయన.. తెలంగాణ యువతకు తన అభినందనలు..శుభాకాంక్షలు తెలిపారు. యావత్ భారతదేశంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 24 మంది విద్యార్థులలో 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉండటంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అందులోనూ బాలికల విభాగంలో చుక్కా తనూజా టాపర్ గా నిలవడం మరింత ఆనందకరమని కేటీఆర్ అన్నారు. కాగా, జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది విద్యార్థులు వందకు వంద శాతం స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తంగా 24 మంది విద్యార్థులు వందకు వంద శాతం మార్కులను సాధించారు. ఇందులో 8మంది తెలంగాణ విద్యార్థులేకాగా, మిగతావారిలో ఢిల్లీ నుంచి ఐదుగురు, రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హర్యానా నుంచి ఇద్దరు వందకు వంద శాతం స్కోర్ సాధించినవారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 8.58 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… ఇందులో 74శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో సెప్టెంబర్ 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌కు 2.45 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.