మానవత్వాన్ని చాటుకున్న మంత్రి.. రహదారిపై ఆపద్బాంధవుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఆపద్బాంధవుడు అయ్యాడు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి, దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరోని బండకు చెందిన రమేష్ టిఫిన్ చేసి రోడ్డు దాటుతున్నాడు.

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి.. రహదారిపై ఆపద్బాంధవుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
Minister Komatireddy Venkata Reddy Shows Humanity

Edited By:

Updated on: Feb 17, 2026 | 4:00 PM

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఆపద్బాంధవుడు అయ్యాడు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి, దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరోని బండకు చెందిన రమేష్ టిఫిన్ చేసి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ అనే వ్యక్తి బైక్ పై హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న రమేష్ ను బైక్ తో వెంకట్ ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపారు. క్షతగాత్రుల వద్దకు వచ్చి అంబులెన్స్‌కి కాల్ చేసి వెంటనే పిలిపించారు. హైవేపై ట్రాఫిక్ కు ఇబ్బంది కాకుండా తన గన్ మెన్లతో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయించారు. తన సిబ్బందితో బాధితులను అంబులెన్స్ లోకి ఎక్కించి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ధైర్యం చెప్పి.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

నిత్యం హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలతో రక్తసితమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద అండర్ పాస్, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. హైవేపై ప్రమాదాల నివారణకు పదివేల కోట్ల రూపాయలతో ఈ హైవే-65ని 8 లైన్ల రహదారిగా మారుస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. క్షతగాత్రుల పట్ల మంత్రి కోమటిరెడ్డి చూపిన మానవత్వం పట్ల వాహనదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి…

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us