
సోమవారం రోజున ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాగుల్ గాంధీ హాజర్యయారు. సభా వేదికగా ఆయన సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలే రాహుల్ గాంధీ బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యాలకు కౌంటర్‌గా మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు. మిషన్ భగీరథ, కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులపై రాహుల్ గాంధీ కామెంట్లు చేయడం తెలంగాణ ప్రజల్ని అవమానపరచడమే అన్నారు. లక్షల కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందనడం అతిపెద్ద జోక్ అన్నారు.
కరవు కాలంలో కూడా సాగునీరు ఇచ్చే దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. స్వచ్ఛమైన మాటలు లేకుండా అన్ని బురదజల్లే మాటలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని బడుగు బలహీన వర్గాల టీం అని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. 2009, 2014 మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామిని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణక ప్రజలకు బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవడం తెలుసని.. కేసీఆర్ ఉన్నంతకాలం ఎవరి జిమ్మిక్కులు సాగవని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..