Telangana: మబ్బే మసకేసింది.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

జిల్లాల్లో కూడా వాతావారణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక నేటి నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో...

Telangana: మబ్బే మసకేసింది.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇక సెప్టెంబరు 2న కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ‘ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated on: Sep 03, 2023 | 7:45 AM

గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. పలు చోట్ల రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీనడం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాన్నాయి. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 30 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అలర్ట్‌ చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. ముఖ్యంగా షేక్‌పేట్‌, మణికొండ, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.

ఇక జిల్లాల్లో కూడా వాతావారణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక నేటి నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. వచ్చే రెండు రోజులు కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 4, 5 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా దక్షిణ ఆంధ్ర వరకు విస్తిరించి ఉంది. దీని ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..