Operation Sindoor: మేరా భారత్ మహాన్.. జై హింద్.. ఆపరేషన్ సిందూర్‌పై బండి సంజయ్, అసదుద్దీన్ ఏమన్నారంటే..

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో ఆర్మీ దాడులు చేసింది. పుల్వామా ఎటాక్‌కి ప్రతీకారంగా బహావల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసింది. J&Kలో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్‌పై ఎయిర్‌ స్ట్రైక్‌ చేసింది..

Operation Sindoor: మేరా భారత్ మహాన్.. జై హింద్.. ఆపరేషన్ సిందూర్‌పై బండి సంజయ్, అసదుద్దీన్ ఏమన్నారంటే..
Asaduddin Owaisi Bandi Sanjay

Updated on: May 07, 2025 | 9:06 AM

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో ఆర్మీ దాడులు చేసింది. పుల్వామా ఎటాక్‌కి ప్రతీకారంగా బహావల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసింది. J&Kలో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్‌పై ఎయిర్‌ స్ట్రైక్‌ చేసింది.. ఒక దెబ్బకు మూడు పిట్టలు అనేలా.. రాత్రిరాత్రికే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది ఇండియన్‌ ఆర్మీ.. మొత్తంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి

ఆపరేషన్ సింధూర్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ట్వీట్..

ఆపరేషన్ సిందూర్ పై అభినందనల వెల్లువ వ్యక్తమవుతోంది.. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

భారత్ మెరుపుదాడులపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాక్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. మేరా భారత్ మహాన్.. జై హింద్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ఆపరేషన్ సింధూర్ పై అసదుద్దీన్ ట్వీట్..

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ ఘటన మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్! అంటూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..