
సింగరేణి, జూన్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోనీ సింగరేణి గనుల వద్ద ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. భారీ శబ్దాలతో రాత్రి సంచరించడంతో స్థానికులు, కార్మికులు భయాందోళన చెందారు. ఓసి ఫోర్ గని లోని నీటిని పంపించేసే మోటర్ల వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఓ భారీ కొండచిలువ సంచరించడం చూసిన కార్మికులు భయాందోళనకు గురయ్యారు..గోల్డ్ కలర్ లో అర్ధరాత్రి చీకట్లో మెరిసి పోతూ కనిపించింది.
వెంటనే స్నేక్ క్యాచర్ ముజాఫర్ కు సమాచారం అందించడంతో అతను వచ్చి కొండచిలువను పట్టుకొని రేగులగండి రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలేశాడు, భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ ముజాఫరను సింగరేణి అధికారులు అభినందించారు, ఈ సందర్భంగా ముజాఫర్ మాట్లాడుతూ ఇది రాక్ పైతాన్ అనే జాతికి చెందిన కొండచిలువ అని తెలిపారు. పాములు విష సర్పాలైన మనుషులని ఏమీ చేయవని, అనవసరంగా వాటికి హాని తలపెట్టవద్దని, పాములు, కొండచిలువ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.