Manjira Kumbha Mela: అట్టహాసంగా ప్రారంభమైన మంజీర గరుడ గంగ కుంభ మేళా.. పోటెత్తిన భక్తులు..

సంగారెడ్డి జిల్లాలో మంజీర గరుడ గంగ కుంభ మేళ కోలాహలంగా ప్రారంభమైంది. న్యాల్ కల్ మండలం రాఘవపూర్ వద్ద తెప్పోత్సవంతో ఘనంగా మొదలైన మంజీర కుంభమేళకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కుంభమేళాను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి నాగ సాదులు.. సాధువులు, భక్తులు హాజరవుతున్నారు.

Kumbh Mela

Updated on: Apr 25, 2023 | 6:39 AM

సంగారెడ్డి జిల్లాలో మంజీర గరుడ గంగ కుంభ మేళ కోలాహలంగా ప్రారంభమైంది. న్యాల్ కల్ మండలం రాఘవపూర్ వద్ద తెప్పోత్సవంతో ఘనంగా మొదలైన మంజీర కుంభమేళకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కుంభమేళాను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి నాగ సాదులు.. సాధువులు, భక్తులు హాజరవుతున్నారు.

ఆదివారం మొదలైన మంజీర కుంభమేళ 12 రోజుల పాటు కొనసాగనుంది. మే 5 వరకు కొనసాగనున్న నదీ పుణ్య స్నానాల మేళా ఆధ్యాత్మిక గురువులు, ఉత్తర భారతం నుంచి తరలివచ్చే నాగ సాధువులు, దిగంబర సాధుసంత్‌ల సందడితో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది.

మంజీర తీరంలో గంగమాత, గరుడ దేవాలయాల వరకు భారీగా బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ డిపో నుంచి 12 ప్రత్యేక బస్సులను 40 ట్రిప్పులు నడుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..