వ్యభిచార చేయకపోతే చంపేస్తాంటూ వేధింపులు.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ

|

Feb 17, 2021 | 1:39 PM

మహిళలపై రోజురోజుకు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లిలో ఓ మహిళపై ఓ వ్యక్తి వ్యభిచారం చేయాలంటూ వేధిస్తుండటం కలకలం..

వ్యభిచార చేయకపోతే చంపేస్తాంటూ వేధింపులు.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ
Follow us on

మహిళలపై రోజురోజుకు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లిలో ఓ మహిళపై ఓ వ్యక్తి వ్యభిచారం చేయాలంటూ వేధిస్తుండటం కలకలం రేపుతోంది. రమేష్‌ అనే వ్యక్తి ఓ మహిళను వేధిస్తున్నాడు. ఒక వేళ వ్యభిచారం చేయకుంటే చంపేస్తానని రమేష్‌ వేధించడమే కాకుండా తీవ్రంగా చితకబాదడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వ్యభిచారం చేయకుంటే బ్రోతల్‌గా ప్రచారం చేస్తానంటూ బెదిరిస్తున్నాడని మహిళ చెబుతోంది.

అయితే తనకు రక్షణ కల్పించాలంటూ రెండు నెలల కిందటనే పోలీసులను ఆశ్రయించింది. అయినా రమేష్‌ ఏ మాత్రం మారకుండా వేధింపులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. కాగా, పది సంవత్సరాల కిందట జిల్లా కేంద్రంలోని రమేష్‌కు చెందిన ట్రావెల్స్‌లో సదరు చేసినట్లు సదరు మహిళ పేర్కొంది. అలాగే నాలుగు సంవత్సరాలుగా రమేష్‌ తో సహజీవనం కూడా చేసినట్లు మహిళ పోలీసుల ముందు తెలిపింది.

Also Read: Gas Cylinder Explosion: ఖమ్మం చర్చ్ కాంపౌండ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు..