రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..

|

Sep 23, 2021 | 5:40 PM

అయ్యో పాపం.. ఈ దారిపై నిలిచిన నీటిలో ఎవరో పడిపోయి చనిపోయాడని అనుకున్నారు. అయితే కాసేపు అలానే చూస్తుండిపోయినవారికి అతడిని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..
Shavasan
Follow us on

ఇటు వర్షాలు, అటు పొంగుతున్న డ్రైనేజీలు, గుంతలు, పాడైన రోడ్లు ఇవన్నీ కలసి- ప్రధాన రహదారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా రోడ్లు డ్యాన్సులు చేస్తున్నాయి. భారీ వర్షం కురిస్తే, ఎక్కడ రోడ్డు ఎలా కుంగుతుందో జనానికి అర్థంకావడం లేదు. ఈ పరిస్థితుల్లో మరో అల్పపీడనం ఉందనీ.. భారీ వర్షాలు వస్తాయనీ.. హెచ్చరికలు వస్తున్నాయి. వచ్చే భారీవర్షాలకు ఎక్కడ గుంతలు పడతాయోనని జనం కలవరపడుతున్నారు. ఇంత వర్షం కురుస్తున్నా.. రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నా.. నీళ్లు భూమిలోకి ఇంకడం లేదు. రోడ్లపై అధ్వాన్న పరిస్థితి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లపై ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

చిన్న వర్షం వచ్చినా.. పెద్ద వర్షం వచ్చినా ఇక్కడి రోడ్లు పంటపొలాలను తలపిస్తున్నాయి. ఓ సామాన్యుడు ఇది పంటపొలం అనుకున్నాడో.. లేక స్విమ్మింగ్ పూల్ అనుకున్నాడో తెలియదు.. వెంటనే అందులోకి దూకేశాడు. అందులో విచిత్రమై ఆసనాలు వేయడం మొదలు పెట్టాడు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించినా తన విన్యాసాలు కొనసాగించాడు. ఇది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రదాన రహదారిలో ఇలా అతని విచిత్ర విన్యాసాలు కనిపించాయి.

అయ్యో పాపం.. ఈ దారిపై నిలిచిన నీటిలో ఎవరో పడిపోయి చనిపోయారనుకున్నారు. కాసేపు ఆగిన తర్వాత తెలిసింది అతనో మానసిక వికలాంగుడు అని.. రహదారిపై నిలిచిన నీటినే స్విమ్మింగ్ పూల్‌గా బావించి అందులో ముగడం… తనలోనే తాను సంతోష పడటం.. ఇది చూసిన తర్వాత కాని అక్కడికి వచ్చినవారకి అర్థం కాలేదు అతని పరిస్థితి. ఆ మురుగు నీటిలోనే శవాసానాలు వేస్తూ కనిపించాడు.

లక్షేట్టిపేటపేట్ మున్సిపాలిటీలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారి వద్ద కనిపించింది ఈ దృశ్యం. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం.. నాలాలు కబ్జాకు గురవడంతో ఈ సమస్య తలెత్తుదంటున్నారు స్థానికులు‌. చినుకు పడితే చాలు ఈ ప్రాంతం చెరువులా తలపిస్తుందని.. గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..

LIC IPO: డ్రాగన్‌ కంట్రీకి మోడీ సర్కార్ మరో ఝలక్‌.. ఇక ముందు భారత్‌లోకి అలా నో ఎంట్రీ..