
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఓటు వేసి ఇంటికి వెళ్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందాడు. సిద్దిపేటలోని భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓటు వేసి నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటుతో స్వామి(54) మృతి చెందాడు. స్వామి ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై మృతి చెందారు. మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఓటు వేయడానికి బూత్‌కు వచ్చిన సందర్భంగా ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించే లోపే మృతి చెందింది. అదేవిధంగా భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) ఓటు వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డాడు. అంతలోనే కళ్లు తిరిగి పడిపోవడంతో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు.
మరోవైపు తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగిసిన పోలింగ్ ముగిసింది.
చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే 4 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..