Mynampally Hanumantha Rao: బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి గుడ్‌ బై.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారంటే..

|

Sep 23, 2023 | 9:16 PM

తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్ఖానంపై అలకతో ఉన్నారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఊగిపోతున్నారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్ రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయింది. తనకు మాత్రమే టికెట్ఇచ్చి..

Mynampally Hanumantha Rao: బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి గుడ్‌ బై.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారంటే..
Mynampally Hanumanth Rao
Follow us on

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్ఖానంపై అలకతో ఉన్నారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఊగిపోతున్నారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్ రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయింది. తనకు మాత్రమే టికెట్ఇచ్చి.. తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కొన్ని రోజులుగా మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.అయినప్పటికీ ఆయన నుంచి క్లారిటీ రాకపోవడతో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య మంత్రి హరీష్‌రావుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

మైనంపల్లి మనసు ఎంపీ స్థానం వైపు మల్లడం వెనక పెద్ద కారణమే ఉంది. తాను ఎంపీగా పోటీచేసి… కుమారుడు మైనంపల్లి రోహిత్‌ను మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలనుకుంటున్నారు. దీనికోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. రోహిత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. లోకల్‌గా యూత్‌లో గ్రిప్‌ సంపాదించేలా.. ప్రచారం కూడా జోరుగానే చేస్తున్నారు.

ఎమ్మెల్యే స్థానం కొడుక్కి… ఎంపీ స్థానం తండ్రికి… అంటూ మైనంపల్లి ఫ్యామిలీ పొలిటికల్‌ లెక్కలు బానే ఉన్నాయి. కానీ, అదంత ఈజీనా అనే చర్చ లోకల్‌గా జరుగుతోందిప్పుడు. ఎందుకంటే, 2019లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి.. మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు… మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నియోజకవర్గంలో యాక్టివ్‌గానే ఉంటూ.. ఈ దఫా గెలిచి తీరాలనే ప్రయత్నంలో ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. మైనంపల్లి వ్యవహారం మర్రికి మింగుడు పడటం లేదు. నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంటే… మైనంపల్లి మడతపేచీ ఏంటో అర్తం కావడం లేదని.. అనుచరుల దగ్గర వాపోతున్నారంట రాజశేఖర్‌రెడ్డి. పార్టీలోని సన్నిహితుల దగ్గర కూడా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారని టాక్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం