సూర్యాపేట జిల్లా కోదాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న డీజిల్ ట్యాంకర్‌ను వేగంగా దూసుకొచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు వాహనాలను అక్కడే వదిలి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి రెండు లారీలు పూర్తిగా కాలిపోయాయి.