Couple Commits Suicide: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడలో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. అయితే వీరు పానీపూరీ వ్యాపారం చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. అయితే ఇంతలో ఏమైందో తెలిదుగానీ ఆ దంపతులిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరి ఆత్మహత్యపై విచారణ చేపడుతున్నారు. వారు నివసిస్తున్న ప్రాంతంలో పలువురిని విచారించారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆటో – జీపు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి