మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కోపంతో దారుణానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. మందమర్రి మండలంరాకృష్ణాపూర్‌లో ప్రమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో పగ పెంచుకున్న ఆ యువకుడు మద్యం మత్తులో..యువతి గొంతుకోశాడు. అనంతరం తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోయిన ప్రియురాలిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేపట్టారు.