Telangana: అడవి సమీపాన సేద తీరుతుండగా.. మట్టిలో కనిపించిన నల్లటి ఆకారం.. తవ్వి చూడగా

కొంతమంది భక్తులు ఏపీ నుంచి భద్రాచలం వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఓ చోట సేద తీర్చుకోవడానికి బస్సు ఆపారు. అడవికి సమీపంలో వారు సేద తీరుతుండగా.. మట్టిలో ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఏంటని దాన్ని తవ్వి చూడగా.. అయ్యబాబోయ్.! అది..

Telangana: అడవి సమీపాన సేద తీరుతుండగా.. మట్టిలో కనిపించిన నల్లటి ఆకారం.. తవ్వి చూడగా
Ap News

Edited By: Ravi Kiran

Updated on: Apr 26, 2025 | 12:27 PM

బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద బయటపడ్డ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహన్ని బయటికి తీసి పూజలు చేశారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు. అయితే అర అడుగు లోతులో విగ్రహం బయటపడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది. విగ్రహం ఏర్పాటు పేరిట అడవిని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో భూమిలో నుంచి హనుమాన్ విగ్రహం బయటపడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన భక్తుల బృందం భద్రాచలం వెళ్తున్న క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళగా.. అక్కడ భూమిలో హనుమాన్ రాతి విగ్రహం కనిపించడంతో బయటకు తీసి పూజలు నిర్వహించారు భక్త బృందం.

మణుగూరు – భద్రాచలం కూడలి వద్ద ఈ విగ్రహం బయటపడడం పలు సందేహాలకు తావిస్తోంది. అర అడుగు లోతులో విగ్రహం ఉండడం, స్థానికులు ఎవరికీ ఇప్పటి వరకు ఆ విగ్రహం కనపడకపోవడం పట్ల స్థానికులతో పాటు అటవీశాఖ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ భూమిని కబ్జా చేసే ప్రయత్నాల్లో భాగంగానే విగ్రహం పేరుతో డ్రామాలాడుతున్నారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. విగ్రహం ఏర్పాటు పేరుతో అడవిని విధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు.