Telangana: జనవరిలో బోలెడన్ని సెలవులు.. వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండిలా..

జనవరిలో వరుసపెట్టి సెలవులు రానున్నాయి. ఒక పక్క సంక్రాంతి సెలవులు ఉండగా.. మరో పక్క సాధారణ సెలవులు రానున్నాయి. మరి మీరూ వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే.. ఇలా ప్లాన్ చేసుకోండి. ఆ వివరాలు ఇలా.. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

Telangana: జనవరిలో బోలెడన్ని సెలవులు.. వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండిలా..
Telangana Students

Updated on: Dec 22, 2025 | 6:19 PM

కొత్త నెల వచ్చిందంటే చాలు.. మన అందరం కూడా ముందుగా ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయన్నదే చూస్తాం. మరి అసలే కొత్త సంవత్సరం పైగా స్టార్టింగ్ మంత్.. సెలవులు గట్టిగా ఉంటాయ్ మరి. ఇక 2026 జనవరిలోనూ బోలెడన్ని సెలవులు రానున్నాయి. అలాగే రెండు సార్లు లాంగ్ వీకెండ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 1(గురువారం)తో కొత్త సంవత్సరం, శుక్రవారం జనవరి 2న ఒక్క రోజు సెలవు పెడితే.. ఆపై శనివారం, ఆదివారం కలిపి వరుసగా 4 రోజులు హాలీడేస్ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే జనవరి 24న శనివారం, 25 ఆదివారం, సోమవారం 26న గణతంత్ర దినోత్సవం హాలీడే ఎలాగూ ఉంది.

జనవరి 23న శుక్రవారం వసంత పంచమి రోజున సెలవు పెడితే వరుసగా 4 రోజులు హాలీడే దొరికినట్టు అవుతుంది. అలాగే సంక్రాంతి సెలవులు 13 లేదా 14 నుంచి 18 వరకు ఉంటాయి. ఇక సాధారణ ఆదివారాలు, సెకండ్, ఫోర్త్ శనివారాలు కూడా ఉన్నాయి. వెరిసి దాదాపుగా 10 నుంచి 12 రోజుల వరకు స్కూల్స్‌కి సెలవులు దొరుకుతాయి. కాగా, ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..