బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై తనకున్న మక్కువను వీలున్నప్పుడల్లా చాటుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనువడు కల్వకుంట్ల హిమాన్షు కూడా నడుస్తున్నాడు. హిమాన్షు తీరిక సమయంలో తన తాతయ్యతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నాడు. అచ్చమైన రైతన్నలా పొలం పనులు చేస్తున్నాడు. పార చేతబట్టి పొలంలో చెమట చిందిస్తున్నాడు. హిమాన్ష్ వ్యవసాయ పనుల్లో నిమగ్నంకాగా.. మనవడు చేస్తున్న పొలం పనిని చూసి కేసీఆర్ కూడా మురిసిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షు తన తాత సూచనలతో తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పాడు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు. సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు సందేశమిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాన్షు వ్యవసాయం పట్ల మక్కువ చూపడం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అభినందిస్తున్నారు.
వ్యవసాయ పనులు చేస్తోన్న హిమాన్షు రావు..
Learning from the best ❤️🥰
Afforestation is essential to mitigate the effects of climate change, and we are responsible to protect and preserve our natural resources. pic.twitter.com/TreaW2inDm
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) January 16, 2025