KTR: చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపారు.. కానీ, ఇక్కడ బొగ్గు బావులు వేలం వేస్తున్నారు..

|

Jun 20, 2024 | 5:32 PM

16 ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తెలంగాణకు బొగ్గు గనుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

KTR: చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపారు.. కానీ, ఇక్కడ బొగ్గు బావులు వేలం వేస్తున్నారు..
KTR
Follow us on

16 ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తెలంగాణకు బొగ్గు గనుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, బొగ్గు గనుల వేలానికి రెండు పార్టీలు మద్దతు పలుకుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కు ప్రజలు ఎంపీ స్థానాలు గెలిపించి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే అవకాశం ఉండేదని కేటీఆర్ వివరించారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 స్థానాలు టీడీపీ కి ఇస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపారు చంద్రబాబు.. కానీ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కి 16 స్థానాలు ఇస్తే బొగ్గు బ్లాకులు వేలం వేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అప్పట్లో కేసిఆర్ కేంద్రానికి లేఖ రాసి వేలం ఆపించారు.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఆక్షన్ పెట్టవద్దు అని లేఖ రాయటంతోపాటు ట్వీట్ కూడా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని, అమ్ముతున్నం అని చెప్తున్నారు. ఎందుకు నష్టాల్లో పోయిందో అందరికీ తెలుసు. గని లేకపోవడంతో బైలదిల్ల గనులు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ నడుస్తుంది అని అడిగితే వేలంలో పాల్గొంటే వస్తుంది అని చెప్పారు. కానీ బైలదిల్ల దక్కలేదున్నారు. అందుకే నష్టాల్లో స్టీల్ ప్లాంట్ నడుస్తుందన్నారు.

ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులు వేలం పాట పెడితే తెలంగాణ నష్టపోతుంది. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఖతం చేసినట్టే తెలంగాణ బొగ్గు గనులు కూడా అదే రీతిలో కాబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇప్పుడు బయట పడుతున్నాయన్నారు. కేసిఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు సాగనివ్వలేదు.. కానీ ఇప్పుడు బొగ్గు గనులు ఆగమయ్యే పరిస్థితికి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టిను కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసులకు భయపడి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. సింగరేణి ప్రయివేటీకరణ జరగబోతుంది. నాలుగున్నర ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది .. ఇప్పుడు కొన్న బొగ్గు గని మళ్ళీ వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ తర్వాత తమను అనొద్దంటూ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలం పాట ఆపాలి..ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేటీఆర్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..