KTR: కేసీఆర్‌‌కు సర్జరీ కారణంగా ప్రమాణం చేయలేకపోతున్నా.. శాసనసభ కార్యదర్శికి కేటీఆర్‌ విజ్ఞప్తి..

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభమైంది. ఈ క్రమంలో శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ కు సర్జరీ కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నానని మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ తెలిపారు.

KTR: కేసీఆర్‌‌కు సర్జరీ కారణంగా ప్రమాణం చేయలేకపోతున్నా.. శాసనసభ కార్యదర్శికి కేటీఆర్‌ విజ్ఞప్తి..
Kcr Ktr

Updated on: Dec 09, 2023 | 12:40 PM

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన సీనియర్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఆ తర్వాత సీతక్క, ఆ తర్వాత వరుసగా మిగిలిన మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ కు సర్జరీ కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నానని మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు మరో రోజు అవకాశం ఇవ్వాలని ఆయన శాసనసభ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను ఈరోజు BRS శాసనసభ సమావేశానికి, శాసనసభలో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయాను. ఈరోజు హాజరుకాని మరో 4-5 మంది ఎమ్మెల్యేలతో కలిపి ప్రమాణ స్వీకారానికి మరో తేదీని కేటాయించాలని అసెంబ్లీ సెక్రటరీ కోరాను.’’ అంటూ కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేశారు.

కాగా.. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్‌ జారిపడటంతో గురువారం రాత్రి హుటాహుటిన సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లో కేసీఆర్‌ ఎడమ తుంటికి గాయం అయినట్టు గుర్తించిన వైద్యులు.. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణ చికిత్స పొందుతున్నారు. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని 6 నుంచి 8 వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారు.

కేటీఆర్ ట్వీట్ ..

తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌..

కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు తమ పక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ పేరును సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కడియం శ్రీహరి దాన్ని బలపరిచారు. శాసససభాపక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శాసనసభాపక్షం భేటీ తర్వాత BRS ఎమ్మెల్యేలందరూ బస్సులో అసెంబ్లీకి వచ్చారు. తొలుత గన్‌పార్కుకు వెళ్లి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..