
ఇంట్లో ఉన్న రూ.25లక్షల విలువైన నగదు, బంగారంతో 17 ఏళ్ల బాలుడు పారిపోయిన ఘటన హైరాబాద్‌లోని కూకట్‌పిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ కాలనీలో నాగిరెడ్డి అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఇతనికి సిద్ధార్థ్ అనే 17 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే గత రెండ్రోజుల క్రితం సిద్ధార్థ్ ఇంట్లో ఉన్న సుమారు 9 తులాల బంగారం, రూ. 8 లక్షల నగదుతో పాటు తన తండ్రి బైక్ కూడా తీసుకొని పారిపోయాడు.
అయితే పారిపోయే ముందు సిద్ధార్థ్ రెడ్డి ఓ లేఖ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్లాడు. అందులో ఇలా రాసుకొచ్చాడు.. ‘సారీ నాన్నా నేన్ వెళ్తున్నా.. బైక్‌ను బయట ఎక్కడో ఒకచోట వదిలేస్తానని లేఖలో పేర్కొన్నాడు. అద చూసిన తల్లిదండ్రులు మొదటి ఫోన్ చేయగా స్విచ్ఛ్ ఆఫ్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని.. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు కూడా మిస్సైందని పేర్కొన్నారు.
అయితే, సిద్ధార్థ్ ఇంట్లోంచి వెళ్లి పోవడం ఇది తొలిసారేం కాదని.. గతంలోనూ ఒకటి రెండు సార్లు ఇలానే పారిపోయి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో డబ్బు, బంగారం తీసుకొని పారిపోవడం ఇదే తొలిసారని పేరెంట్స్ చెబుతున్నారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుతో పాటు చోరీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.