Kothapet Market: ఇవాళ రాత్రిలోపు కొత్తపేట్ ప్రూట్ మార్కెట్‌ ఖాళీ.. తరలింపు ఆపాలంటూ హైకోర్టుకు వ్యాపారులు!

Kothapet fruit market: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపును ఆపాలని హైకోర్టు ను పండ్ల వ్యాపారులు ఆశ్రయించారు. ఇప్పటికే ఇవాళ్టి నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించారు.

Kothapet Market: ఇవాళ రాత్రిలోపు కొత్తపేట్ ప్రూట్ మార్కెట్‌ ఖాళీ.. తరలింపు ఆపాలంటూ హైకోర్టుకు వ్యాపారులు!
Kothapet Fruits Market
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 25, 2021 | 2:02 PM

Gaddiannaram Fruit Market: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపును ఆపాలని హైకోర్టు ను పండ్ల వ్యాపారులు ఆశ్రయించారు. ఇప్పటికే ఇవాళ్టి నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించారు. ఇదివరకే ప్రకటించినట్లుగా బాటసింగారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌‌లోకి తరలించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న పండ్ల మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయనున్నట్టు స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈనేపథ్యంలో పండ్ల వ్యాపారులు నెలరోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నపలంగా మార్కెట్‌ చేయలేమని వ్యాపారులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఖాళీ చేసేందుకు ఈ నెల 30 వరకు టైమ్‌ ఉందని.. అప్పటి వరకు ఖాళీ చేయకుండా చూడాలని కోరారు. వ్యాపారుల పిటిషన్‌పై విచారణ సెప్టెంబర్ 30కు హైకోర్టు వాయిదా వేసింది.

ఇదిలావుంటే, మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఫ్రూట్‌ మార్కెట్‌ కనుమరుగు కాబోతోంది. ఈ రాత్రికే నగర శివారులోకి తరలబోతోంది. ఫ్రూట్‌ మార్కెట్‌ అంటేనే గుర్తుకు వచ్చే కొత్తపేట్‌ మార్కెట్‌ బాటసింగారానికి వెళ్లి పోతోంది. ఇవాళ రాత్రికి కొత్తపేట్‌ మార్కెట్‌కు తాళం పడబోతోంది. ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ బాటసింగారంలో ఏర్పట్లను పూర్తి చేసింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో కొద్ది రోజుల పాటు ఉండేందుకు అధికారులు సిద్ధం చేశారు. అయితే.. బాటసింగారంలో ఏర్పాటు చేసే లాజిస్టిక్‌ పార్కులో ఈ తాత్కాలిక మార్కెట్‌ను ఉంచుతున్నారు. కొత్తపేట్‌ మార్కెట్‌కు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేయబోయే కోహెడ మార్కెట్‌లో నిర్మాణాలు ఫైనల్‌ దశకు చేరుకోకపోవడంతో తాత్కాలికంగా ఇబ్బందులు కలగకుండా బాటసింగారానికి తరలిస్తున్నారు.

30ఏళ్లుగా రైతులకు, కమీషన్‌ ఏజెంట్లకు సేవలందిస్తున్న ఈ మార్కెట్‌ ఇవాళ రాత్రి నుంచి కనుమరుగు కాబోతోంది. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంతో 1986లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే.. అప్పుడు కొత్తపేట హైదరాబాద్‌కు శివారులో ఉండడంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. నగరంలోని మలక్‌పేట్‌ మార్కెట్‌ను కొత్తపేట్‌కు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల వ్యాపారం జరిగింది.

అయితే.. హైదరాబాద్‌ విస్తీర్ణం ఈ 20 ఏళ్లలో అనుకున్నదానికంటే.. ఎక్కువ పెరగడంతో కొత్తపేట్‌ మార్కెట్‌ను కూడా తరలించడం అనివార్యం అయింది. గత సంవత్సరమే తాత్కాలిక షెడ్లు వేసి కోహెడకు తరించారు. అయితే.. గాలివాన బీభత్సానికి షెడ్లన్నీ కుప్పకూలాయి. మార్కెట్‌ను నిర్వహించడం సాధ్యకాదన్న ఆలోచనతో మళ్లీ కొత్తపేట్‌లో రన్‌ అవుతోంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం నిర్ణయంతో మార్కెట్‌ తరలింపు తప్పడం లేదు. ఇక్కడ ఉన్న 22 ఎకరాల స్థలాన్ని మార్కెటింగ్‌ శాఖ వైద్య శాఖకు అలాట్‌ చేసింది. దీంతో ఎలాగైనా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం కృషి చేశారు. దాని ఫలితంగానే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది. ఫ్రూట్ మార్కెట్ స్థలంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా కోహెడలోని 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్‌ ఏర్పాటుకు గతేడాది ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

అయితే, ఫ్రూట్ మార్కెట్ కు కోహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించేలా చర్యల కోసం డీపీఆర్ సిద్ధం చేసి పనులు చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఆస్పత్రి నిర్మాణం త్వరగా ప్రారంభించేలా మార్కెట్ ను బాటసింగారంలోని లాజిస్టిక్ కు పార్క్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్రూట్ మార్కెట్‌లోని కమీషన్ ఏజెంట్లు, హమాలీలు మాత్రం తరలింపుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తరలివెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటూనే.. కానీ బాటసింగారంలో సౌకర్యాలు కల్పించకుండా వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కమీషన్ ఏజెంట్ల కొర్రీతో ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్‌ డైలామాలో ఉన్నప్పటికీ.. మెజారిటీ నిర్ణయంతో తరలింపు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Read Also… జంతువుల జిమ్ వర్కౌట్స్.. జూ పార్క్‌లో మూగజీవాల ఎక్సర్‌సైజులు చూస్తే ఫిదా కావాల్సిందే..