
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏమార్చాడు. స్నేహితుడి గదికి తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను కూడా అనుభవించండి అంటూ ఉసిగోలిపాడు. ఎవరికి వారు 14 ఏళ్ల బాలికపై వేర్వేరుగా ఒక్కో రోజు ఒక్కో స్థలంలో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా పదేపదే తాము చెప్పినచోటుకి రావాలంటూ బెదిరింపులు వస్తుండటంతో ఆ బాలిక తల్లికి విషయం చెప్పింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రమేయం ఉన్న మొత్తం ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సుజాతనగర్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామా నికి చెందిన ఆటో డ్రైవర్ మార్తి రామకృష్ణ (21) ప్రేమిస్తున్నా నంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకోవడానికి మా స్నేహితుడి సలహా తీసుకుందాం అంటూ ఈ నెల 3న తన ఇద్దరు స్నేహితు లైన అదే గ్రామానికి చెందిన జాలై నవీన్ (26), గణేశ్ సాయంతో ఆటోలో పాత ఆర్టీసీ డిపో సమీపంలో అద్దెకు ఉంటున్న తన బంధువు, బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేశ్ గదికి తీసుకెళ్లారు. స్నేహితులను పంపించేసి బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఇంటికి పంపించిన తర్వాత తోటి ఆటో డ్రైవర్లు, బడేటి మహేశ్ , విజేందర్ లకు జరిగిన విషయం చెప్పాడు.
ఇదే అదనుగా నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయంటూ ఆ ఇద్దరూ బాలికను బెదిరించారు. వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఉండాలంటే తమతో పాటు శారీరకంగా కలవాలని బలవంతం చేశారు. ఎవరికి చెప్పకుండా మేము చెప్పిన ప్రదేశానికి రావాలంటూ ఒత్తిడి చేశారు. బాలికను బెదిరించి ఈ నెల 4న కలకుంట్ల విజేందర్, 5న బడేటి మహేశ్ ఆటోల్లో వేర్వేరు నిర్మానుష్య ప్రదేశాలకు తీసు కెళ్లి పైశాచికంగా బాలికను అనుభవించారు. మళ్లీ మళ్లీ రావా లంటూ వేధింపులు పెరగడంతో బాలిక జరిగిన విషయాన్ని ఈ నెల 11న తల్లికి చెప్పడంతో అదే రోజు పోలీసులకు పిర్యాదు. చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ, విజేం దర్, మహేశ్, నవీన్ను అరెస్టు చేశారు. వీరికి సహకరించి ఇంటి రూమ్ ఇచ్చిన కానిస్టేబుల్ వెంకటేశ్, గణేష్ పరారీలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి