Kishan Reddy: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.5,012 కేటాయింపు

Kishan Reddy: తెలంగాణ రైలు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి నిరంతర మద్దతు, నిబద్ధతకు ప్రధాని మోదీకి, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు తెలంగాణ ప్రజల తరపున కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టులో..

Kishan Reddy: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.5,012 కేటాయింపు

Updated on: Aug 27, 2025 | 9:26 PM

Kishan Reddy: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని మరింగా మెరుగుపర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ (సనత్‌నగర్) నుంచి వాడి వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ లో ఈ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,012 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ఆమోదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా రూ.12,328 కోట్ల బడ్జెట్‌తో 4-కీ మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 173 కిలోమీటర్ల పొడవున కొత్త లైన్లను నిర్మించనున్నారు. ఐదేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మార్గం విస్తరణ వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 47.34 లక్షల జనాభాకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా, వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన కర్ణాటకలోని కలబురగి జిల్లా అభివృద్ధికి ఇది దోహదపడనుంది. ఈ ప్రాజెక్టుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి, ప్రయాణికులు, సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది.

ఇవి కూడా చదవండి

ఇతర ప్రాజెక్టులలో దేశాల్‌పూర్ – హాజీపూర్ – లూనా, వాయోర్ – లఖ్‌పట్ (కొత్త లైన్), భాగల్‌పూర్ – జమాల్‌పూర్ (3వ లైన్), ఫుర్కేటింగ్ – న్యూ టిన్‌సుకియా (డబ్లింగ్) పనులు ఉన్నాయి. 5 రాష్ట్రాలలో 565 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులు వేగంగా కొనసాగనున్నాయి. ఈ పనులను పూర్తయితే బొగ్గు, ఇతర వస్తువుల లాజిస్టిక్‌లను మెరుగవుతాయి. ఇవి ఆర్థిక వృద్ధిని పెంచుతాయి. వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని మంత్రి అన్నారు.

తెలంగాణ రైలు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి నిరంతర మద్దతు, నిబద్ధతకు ప్రధాని మోదీకి, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు తెలంగాణ ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి