Khammam: వాటే సీన్.. పొంగులేటి.. తుమ్మల షేక్ హ్యాండ్.. ఎక్కడంటే..?
ఈ ఫోటో చూసి క్యా సీన్ హై అనుకునే ఉంటారు. ఈ ఇద్దరూ నేతలు ఖమ్మం జిల్లాలో టాప్ లీడర్స్. మొన్నటివరకు ఒకే పార్టీలో ఉన్నారు. పొసగకపోవడంతో దారులు మార్చుకున్నారు.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. నిన్న మొన్నటివరకూ..ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెత..మరోసారి రుజువైందని వారి అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు మరెవ్వరో కాదు..ఖమ్మం రాజకీయాలను శాసించే నేతల్లో ఒకరు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాగా, మరొకరు మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ అసమ్మతినేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారంలో ఓ వివాహానికి తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంలో ఇద్దరు ఎదురుపడటంతో ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. అదే సమయంలో ఇరువైపుల అనుచరులు జై తుమ్మల, జై పొంగులేటి అంటూ నినాదాలు చేసుకున్నారు. ప్రజంట్ ఈ బడా లీడర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
తొలుత ఈ ఇవురువు నేతలు BRS పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఫీలయ్యారు. అభిమానులు, అనుచరులతో బల ప్రదర్శన చేశారు. అన్నీ లెక్కల వేసుకున్న అధిష్ఠానం.. తుమ్మలను సముదాయించి.. పార్టీలో ఉండేలా పావులు కదిపింది. అటు పొంగులేటికి స్పష్టమైన హామి లభించకపోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఏ పార్టీ.. ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రసంట్ జిల్లా వ్యాప్తంగా తన క్యాడర్‌తో చర్చలు జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..