Telangana: ఏటా దగ్ధమవుతున్న గడ్డివాము.. సీక్రెట్‌గా సీసీ కెమెరాలు అమర్చిన బాధితుడు.. ఫుటేజీలో షాకింగ్ సీన్

అతడు తన పొలంలో వరి పంట కోసి.. ధాన్యం నూర్పిడి చేశాక.. మిగిలిన గడ్డిని పశువుల గ్రాసం కోసం ఇంటికి తీసుకువచ్చి వాము వేసేవాడు. అయితే ఊహించని విధంగా అతడి గడ్డివాము ప్రతి ఏటా తగలబడుతుంది.

Telangana: ఏటా దగ్ధమవుతున్న గడ్డివాము.. సీక్రెట్‌గా సీసీ కెమెరాలు అమర్చిన బాధితుడు.. ఫుటేజీలో షాకింగ్ సీన్
Representative image

Updated on: Feb 28, 2022 | 6:54 PM

Khammam District:  అతడు తన పొలంలో వరి పంట కోసి.. ధాన్యం నూర్పిడి చేశాక.. మిగిలిన గడ్డిని పశువుల గ్రాసం కోసం ఇంటికి తీసుకువచ్చి వాము వేసేవాడు. అయితే ఊహించని విధంగా అతడి గడ్డివాము ప్రతి ఏటా తగలబడుతుంది. ఇలా కొన్నేళ్లుగా జరుగుతుంది. నిప్పు రవ్వల వల్లో, కరెంట్ తీగల వల్లో ఇలా జరుగుతుందిలే అనుకున్నాడు. కానీ ఎందుకో కాస్త తేడాగా అనిపించి.. ఈ ఏడాది ఎవరికీ తెలియకుండా వాము సమీపంలో సీసీ కెమెరాలు(CCTV cameras) అమర్చాడు. దీంతో అసలు బాగోతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..  ఖమ్మం జిల్లాలోని కారేపల్లి( karepalli )సమీపంలో గల బొక్కలతండాకు చెందిన వాంకుడోతు బాబులాల్‌కు రెండు ఎకరాల మాగాణి ఉంది. పంట నూర్చిన తర్వాత.. పశుగ్రాసం కోసం గడ్డిని తీసుకొచ్చి ఇంటి పరిసరాల్లో వాము వేసుకునేవాడు. కొన్నేళ్లుగా అగ్ని ప్రమాదం సంభవించి.. గడ్డి అంతా కాలిపోతుంది. ఇలా ప్రతి ఏడాది జరుగుతుండటంతో ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని అతడు అనుమానపడ్డాడు. ఎవరికీ తెలియకుండా గడ్డి వాము చుట్టూ సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కొద్ది రోజులకు ప్రతి ఏటాలానే ఈసారి కూడా అతని గడ్డి వాము తగలబడింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. అతని అనుమానం నిజమైంది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో అదే తండాకు చెందిన బుచ్చా అనే వ్యక్తి గడ్డి వాముకు అగ్గిపెట్టెతో నిప్పు అంటించడం స్పష్టంగా రికార్డయింది.

దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన బాధితుడు స్థానికులకు విషయం చెప్పి బుచ్చాను పట్టుకుని ఓ గుంజకు కట్టేశాడు. కొన్నేళ్లగా తనకు నష్టం చేకూరుస్తున్నందుకు దేహశుద్ది చేశాడు. విషయం తెలియడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తండాలో ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. బాధితులకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం