Telangana: ‘రాజకీయాల కంటే అనుబంధమే గొప్పది’.. బీఆర్‌ఎస్‌ నాయకుడి పాడె మోసిన బీజేపీ నేతలు.

రాజకీయాల కంటే అనుబంధమే గొప్పదని చాటి చెప్పారు నేతలు. పార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్న ప్రజల కష్టాల్లో మాత్రం ఏకమవుతున్నరు నాయకులు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ జె పి పార్టీల మధ్య ఉన్న విభేదాలు రాష్ట్రమంతా చర్చకు దారి తీస్తున్నాయి. అలాంటి సమయంలో రాజకీయాల...

రాజకీయాల కంటే అనుబంధమే గొప్పదని చాటి చెప్పారు నేతలు. పార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్న ప్రజల కష్టాల్లో మాత్రం ఏకమవుతున్నరు నాయకులు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ జె పి పార్టీల మధ్య ఉన్న విభేదాలు రాష్ట్రమంతా చర్చకు దారి తీస్తున్నాయి. అలాంటి సమయంలో రాజకీయాల కంటే అనుబంధమే గొప్పదని చాటి చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ బీఆర్‌ఎస్‌ నాయకుడు మహేందర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మేల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి , ఈనుగల పెద్దిరెడ్డి రాజకీయాల కంటే అనుబంధాలే గొప్పవని నిరూపించారు. గతంలో ఎబివిపిలో పనిచేసి అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడుగా ఉన్న మహేందర్ రెడ్డి ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.

గుండెపోటుతో మహేందర్ రెడ్డి చనిపోవడంతో బండి సంజయ్, కౌశిక్ రెడ్డి కలిసి పాడి మోయగ ఈటల రాజేందర్ స్మశనానికి వెళ్లి నివాళులు అర్పించారు. మహేందర్ రెడ్డి చనిపోవడంతో ఆయన ఒక్కగానొక్క కొడుకు ‘డాడి లే’ ఏడ్చిన దృశ్యం స్థానికంగా ఉన్నవారందరినీ కంట తడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..