
తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతున్న పాంచనారసింహుడికి ఆదాయం నానాటికి పెరుగుతోంది. ఆధ్యాత్మికంగా కార్తీక మాసం ప్రాముఖ్యత సంతరించుకోవడంతో స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసంలో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తిక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ఆదాయం కూడా భారీగానే సమకూరింది. దీంతో ఆలయానికి భక్తులు భారీ స్థాయిలో రావడంతో రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది.
కార్తీక మాసంలో స్వామి వారిని 20,52,054 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో కార్తీకమాసం నెల రోజుల్లో 17, 62, 33, 331 రూపాయల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత ఏడాది కార్తీక మాసం నెల రోజుల్లో 14,30,69,481 రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే.. ఈసారి కార్తీకమాసంలో 3,31,63,850 రూపాయల అధిక ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రెండున్నర కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.