High Court Of Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నాడు ఉదయం 11.55 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళి సై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు అధికారులు పాల్గొంటారని సమాచారం. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందును ఏర్పాటు చేయనున్నారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న హిమా కోహ్లీ బుధవారం నాడే హైదరాబాద్‌కి వచ్చారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఇదిలాఉంటే.. జస్టిస్ హిమా కోహ్లీ.. తెలంగాణ తొలి మహిళా న్యాయమూర్తి కావడం విశేషం.
Also read:
Trump Twitter: ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను లాక్ చేసిన యాజమాన్యం.. ఆ ట్వీట్లు తొలగించకపోతే..