Bhadradri Kothagudem district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాత చర్లలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ప్రహరీ పునాది తీస్తున్న క్రమంలో గుప్త నిధులు బయటపడ్డాయి. పునాది కోసం తవ్వి మట్టి తీస్తుండగా.. ఒక పురాతన పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో పురాతన కాలం నాటి వెండి కడియాలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. స్థానికుల వెంటనే పోలీసులుకు సమాచాం అందించారు. పోలీసులు గుప్త నిధులను స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
కాగా వందల, వేల సంవత్సరాల క్రితం దొంగల బెడద ఎక్కువగా ఉండేది. కొందరు రాజులు ఇతర ప్రాంతాలపైకి దండెత్తి వచ్చేవారు. బందిపోట్లు కూడా ప్రజలను దోచుకునేవారు. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న వెండి(Silver), బంగారం(Gold) సహా ఇతర విలువైన ఆభరణాలను కాపాడుకునేందుకు ఓ మార్గాన్ని అన్వేశించారు. ఇత్తడి బిందెల్లో, మట్టి కుండల్లో, పాత్రల్లో ఆభరణాలు దాచిపెట్టి.. భూమిలో పాతిపెట్టేవారు. లేదంటే ఇంటి పునాదుల్లో.. గోడల్లో దాచేవారు. అలా పెట్టిన వాటిని గుప్తనిధులు అంటారు. వందల సంవత్సరాల క్రితం ఇలా ఎన్నింటినో భూమిలో దాచిపెట్టి ఉంచారు. అలా భూమిలో దాచిపెట్టిన లంకెబిందెలు తవ్వకాలు జరుపుతుండగా అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.
Also Read: Viral: ఛాలెంజ్ పేరుతో పైత్యం.. ఫ్రూట్ జ్యూస్లో వయాగ్రా