గొయ్యి పడ్డా సోయి లేదా.. గ్రీజ్ పెట్టే గతి లేదా.. నైరుతి తాకినా ఆనకట్టలతో ఆటలా?

ఆల్రడీ కాళేశ్వరంపై పెద్ద రచ్చ జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం బ్యారేజ్‌ దగ్గర బుంగలు పడ్డాయి. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ... బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని చెప్పడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు శ్రీశైలం, జూరాల, మంజీరా ప్రాజెక్ట్‌ మీదా అనుమానాలొచ్చాయి. అసలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఇప్పుడే ఎందుకని ఇన్ని సమస్యలు పుట్టుకొచ్చాయి? తప్పెవరిది?

గొయ్యి పడ్డా సోయి లేదా.. గ్రీజ్ పెట్టే గతి లేదా.. నైరుతి తాకినా ఆనకట్టలతో ఆటలా?
Projects In Danger

Updated on: Jun 28, 2025 | 9:52 PM

‘ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు’ అంటుంటారు. ఇప్పుడా దేవాలయాలే కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ప్రాజెక్టులు అని పేరు లేకుండా చెప్పుకోవడం ఎందుకు.. నేరుగా పేరే ప్రస్తావించుకుందాం. శ్రీశైలం డ్యామ్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా.. ప్రాజెక్ట్‌ నిండగానే గేట్లు ఎత్తుతున్నామని ముందే సమాచారం ఇస్తారు అధికారులు. ఆ వార్త వినగానే ఎక్కడెక్కడి వాళ్లంతా వెళ్తారు చూడ్డానికి. ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ గేట్ల నుంచి నీళ్లు దూకే ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. పాలనురగలాంటి నీళ్లు.. ఒంపులు తిరుగుతూ కింద పడుతుంటుంది. అదిగో.. అలా నీళ్లు దూకి పడే ప్రాంతమే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్‌ మొత్తాన్ని ప్రమాదంలో పడేసింది. చాలా వేగంగా నీళ్లు కిందకి దూకడం వల్ల అక్కడ ఓ గొయ్యి పడింది. చిన్నదేం కాదు. ప్రాజెక్ట్‌ పునాదుల కంటే లోతైన గొయ్యి అది. టెక్నికల్‌గా ప్లంజ్‌ పూల్‌ అంటారు. క్రమంగా ఆ గొయ్యి ఎలా విస్తరిస్తోందంటే.. దాన్ని గనక అలాగే వదిలేస్తే.. ప్రాజెక్ట్‌ గేట్ల వరకు వచ్చేస్తుంది. ఆ నెక్ట్స్‌.. గేట్లు పగిలిపోతాయి. ఆ తరువాత ఏంటంటారా… జల ప్రళయమే ఇక. ఊహించని విపత్తు అంటుంటారు. కాని, ఇది ఊహకందనిదైతే కాదు. శ్రీశైలం డ్యామ్‌కు ఏమైనా అయితే.. నాగార్జున సాగర్, అట్నుంచి పులిచింతల, ఆ తరువాత ప్రకాశం బ్యారేజ్, ఆనుకునే ఉన్న అమరావతి దాకా ప్రభావం పడుతుంది. అంతపెద్ద విపత్తు అది. ఒక్క శ్రీశైలమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి