Etela Rajender: ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్‌కు పిలుపు.. సొంత పార్టీతో పాటు.. పక్క పార్టీలో చర్చ..

అసెంబ్లీ ఎన్నికల వ్యూహమా? బుజ్జగింపులా? అదనపు బాధ్యతలా? ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన మతలబేంటి? దీనిపై సొంత పార్టీతో పాటు.. పక్క పార్టీలో చర్చ సాగుతోంది. ఇంతకీ తెలంగాణకు ఢిల్లీ హైకమాండ్ ఇచ్చే డైరెక్షన్ ఏంటి?

Etela Rajender: ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్‌కు పిలుపు.. సొంత పార్టీతో పాటు.. పక్క పార్టీలో చర్చ..
Etela Rajender

Updated on: May 16, 2023 | 7:25 AM

ఉన్నపళంగా హస్తిన బాట పట్టారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈటల ఢిల్లీ పర్యటన వెనుక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అధిష్టానం ఆయనను ఎందుకు పిలిచిందన్న అంశంపై సొంత పార్టీతో పాటు, పక్క పార్టీలో చర్చ నడుస్తోంది. తెలంగాణ పరిణామాలను ఈటల ఢిల్లీ పెద్దలకు వివరించబోతున్నారన్న సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. పార్టీలన్నీ హోరాహోరీగా వ్యూహాలు రచిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈటలను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలు ఏంటి? బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన మార్గామేంటి? మిషన్‌ 90 సాధనలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అనే సమాచారం తెలుసుకోవడంతో పాటు ఢిల్లీ పెద్దల మార్క్‌ గైడెన్స్‌ ఈటల ద్వారా తెలంగాణ క్యాడర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

కర్నాటక ఫలితాలు కమలం పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ఇక సమీప భవిష్యత్‌లో ఉన్నది తెలంగాణ ఎన్నికలే. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే వరుస కార్యక్రమాలు, ర్యాలీలు, సభల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తున్న కమలం పార్టీ మరింత పెంచాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నట్లు రాష్ట్రంలో చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం