Big News: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ఇది హిస్టారిక్ డే అన్న KTR.. ఏకంగా రూ.24 వేల కోట్లతో

|

Jun 12, 2022 | 6:54 PM

తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ బిగ్ డే. దేశంలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ కంపెనీ పెట్టుబడిని రాష్ట్రం దక్కించుకుంది. డిస్‌ప్లే ఫ్యాబ్ ఎలేస్ట్ కంపెనీ రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Big News: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ఇది హిస్టారిక్ డే అన్న KTR.. ఏకంగా రూ.24 వేల కోట్లతో
Historic Day For Telangana
Follow us on

Telangana: తెలంగాణలో మరో భారీ కంపెనీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఫార్చూన్‌-500 కంపెనీల్లో ఒకటైన రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఎలెస్ట్‌గా పిలిచే ఈ కంపెనీ, తెలంగాణలో 24వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ కంపెనీ పెట్టుబడి దక్కించుకుంది తెలంగాణ స్టేట్. ఇందుకు సంబంధించి బెంగళూరులో కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.  స్మార్ట్‌ టీవీలు, మొబైల్‌ ఫోన్లలో వినియోగించే అత్యాధునిక డిస్‌ప్లేలను ఎలెస్ట్‌ కంపెనీ తయారు చేయనుంది. డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ తయారీలో ఇండియాలోనే అతిపెద్ద యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీతో ఎంవోయూ తర్వాత మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ చరిత్రలో హిస్టారిక్‌ డే అంటూ ప్రస్తావించారు. డిస్‌ప్లే సెక్టార్‌లో ఇండియాలోనే ఇది ఫస్ట్‌ యూనిట్‌గా తెలిపారు. ఇప్పటివరకు జపాన్‌, కొరియా, తైవాన్‌ దేశాలకు మాత్రమే సాధ్యమైన అమోల్డ్‌ డిస్‌ప్లే తయారీ, ఇకపై భారత్‌లో… తెలంగాణ వేదికగా జరగబోతోందన్నారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్‌, స్మార్ట్‌ ఫోన్లకు అవసరమైన ఎకో సిస్టమ్‌ తెలంగాణలో తయారవుతుందన్నారు కేటీఆర్‌.