Ibomma Piracy Case: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి సంచలన విషయాలు!

గత కొంత కాలంగా తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన గుర్తింపు దాచుకునేందుకు రవి.. ప్రహ్లాద్‌ వెల్లేల అనే పేరుతో పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పేరుతో ఉన్న వ్యక్తిని పిలిపించి విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Ibomma Piracy Case: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి సంచలన విషయాలు!
Ibomma Piracy Case

Updated on: Dec 28, 2025 | 9:31 PM

ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవి కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలను తెలుసుకున్నారు. ఇమ్మడి రవి తన గుర్తింపును దాచుకునేందుకు ప్రహ్లాద్‌ వెల్లేల పేరుతో పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతనెవరని ప్రశ్నించగా.. ప్రహ్లాద్ తన రూమ్‌మెంట్‌ అని రవి విచారణలో చెప్పాడు. దీంతో ప్రహ్లాద్‌ బెంగళూరులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

ఇమ్మడి రవి ముందే అతన్ని విచారించారు. అయితే అతను షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అసలు ఈ ఇమ్మడి రవి ఎవరో తనకు తెలియదని.. తన పేరుతో పాన్‌, డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకున్నారనే విషయం తెలియగానే తాను షాకయ్యానని తెలిపినట్టు సమాచారం.

అయితే ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి ప్రస్తుతం బెంగళూరులోని ఒక సాప్ట్‌ వేర్‌ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తుండగా.. ఇమ్మడి రవి ప్రహ్లాద్ డాక్యుమెంట్స్‌ దొంగలించి. వాటి సహాయంతో పాన్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు మరోసారి రవిని కష్టడీకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.