బ్రేకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు వాయిదా..రేపటి పరీక్ష యథాతథం

తెలంగాణలో జరుగుతున్నపదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది పరీక్షలపై  హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని...

బ్రేకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు వాయిదా..రేపటి పరీక్ష యథాతథం

Edited By:

Updated on: Mar 20, 2020 | 2:08 PM

తెలంగాణలో జరుగుతున్నపదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది పరీక్షలపై  హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  రేపు జరగాల్సిన పరీక్ష యథాతథం నిర్వహించాలని..ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని సూచించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే పరీక్షలపై తర్వాత నిర్ణయం
తీసుకోవాలని చెప్పింది. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది.