He is inspiration: సైకిల్ మీద ఫుడ్ డెలివరీ ఇస్తున్న బాయ్ కు అండగా నిలిచిన ఫేస్ బుక్ పేజీ సభ్యులు.. మోటార్ సైకిల్ అందజేత ఎక్కడంటే

|

Jun 20, 2021 | 7:47 AM

Zomato Delivery Boy: కుటుంబం ఎలా ఉన్నా సరే తమ సంతోషం ఇదే అన్నట్లు జులాయిల్లా తిరుగుతుంటారు. మరికొందరు తమ కుటుంబం కోసం అండగా నిలబడానికి ఆర్ధికంగా...

He is inspiration: సైకిల్ మీద ఫుడ్ డెలివరీ ఇస్తున్న బాయ్ కు అండగా నిలిచిన ఫేస్ బుక్ పేజీ సభ్యులు.. మోటార్ సైకిల్ అందజేత ఎక్కడంటే
Zomato Delivery Boy
Follow us on

Zomato Delivery Boy: కుటుంబం ఎలా ఉన్నా సరే తమ సంతోషం ఇదే అన్నట్లు జులాయిల్లా తిరుగుతుంటారు. మరికొందరు తమ కుటుంబం కోసం అండగా నిలబడానికి ఆర్ధికంగా ఆదుకోవడానికి తమ శక్తికి మించి కష్టబడుతుంటారు. అటువంటి యువకులను ఎవరైనా ఆదరిస్తారు అభిమానిస్తారు.. అవసరమైతే అండగా నిలబడతారు..  ఈ విషయం మరోసారి రుజువువైంది. పేదరికంలో ఉన్న తన ఫ్యామిలీ కి అండగా నిలబడేందుకు ఓ యువకుడు జొమాటోలో డెలివరీ బాయ్ గా చేరాడు. సైకిల్ మీద ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాడు. అలా ఫుడ్ డెలివరీ ఇస్తున్న సమయంలో ఓ కస్టమర్‌ చూశాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే అతడి వివరాలు కనుక్కుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కష్టపడే తత్వం ఉంటె.. ఎవరైనా అండగా ఉంటారు అంటూ.. హైదరాబాద్ నగర వాసులు తమకు తోచిన నగదును ఇచ్చారు.. అలా వచ్చిన డబ్బులతో ఆ యువకుడికి మోటార్ సైకిల్ కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ కింగ్‌కోఠికి చెందిన రాబిన్‌ ముకేశ్‌ జొమాటోలో లక్డీకాపూల్‌ లో ఉన్న ఓ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్‌ చేశాడు. ఆ ఆర్డర్‌ను తీసుకోవడానికి అపార్ట్మెంట్ కిందకు వచ్చిన రాబిన్ షాక్ తిన్నాడు.. ఎందుకంటే.. తనకు డెలివరీ చేసిన బాయ్ సైకిల్ మీద వచ్చాడని తెలుసుకుని .. అదీ 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అకిల్ గురించి తెలుసుకున్న్నాడు. పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఆకీల్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదనతో కుటుంబం గడపడం కష్టంగా ఉండడంతో .. ఆకీల్‌ డెలివరీ బాయ్‌గా చేరాడు. అకీల్ పరిస్థితి విన్న జొమాటో వారు కూడా సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేయడానికి అంగీకరించారు.
సైకిల్‌పైనే ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ఓ వైపు ఫుడ్ డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తూనే మరోవైపు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

అకిల్ గురించి రాబిన్ అతనికి సహాయం చేయూలనుకున్నాడు… వెంటనే ఫేస్ బుక్ లో 32 వేల మంది ఉన్న ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’.. పేజీలో అకిల్ గురించి వివరిస్తూ.. ఓ పోస్టు పెట్టాడు. ఆ యువకుడు .. బాధ్యత ను తెలుపుతూ.. అతడికి బండి కొనడానికి రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టు చూసిన వారు వెంటనే తమకు తోచినంత సాయం అందించారు. అలా రెండు రోజుల్లోనే రూ. 73 వేలు వచ్చాయి.

ఆ డబ్బుల్లో రూ.65,800 పెట్టి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం కొని ఆకిల్‌కు అందించాడు రాబిన్ అంతేకాదు.. మిగిలిన డబ్బులతో అతనికి హెల్మెట్‌, రెయిన్‌ కోట్‌, శానిటైజర్‌, మాస్క్‌లు,కొన్నాడు.. ఇంకా మిగిలిన డబ్బులను చదువుకు ఫీజు కోసం వినియోగించుకోమని అందించాడు మానవత్వంతో స్పందించిన రాబిన్ కు అతనికి అండగా నిలిచిన ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ సభ్యులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: దగ్గు వేధిస్తోందా.. వంటింటిలో ఉన్న పదార్ధాలతో తగ్గించుకోవచ్చు అంటున్న ఆయుర్వేదం.. ఆ చిట్కాలు ఏమిటంటే