కావాలనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడు: జగన్

| Edited By:

Apr 16, 2019 | 5:21 PM

గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ సీనియర్ నేతలు. టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. టీడీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. తమ కార్యకర్తలపై కూడా దాడులు చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారన్నారు. ఏపిలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాటు, ఈసీ పనితీరు, ఈవీఎంలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారని.. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. […]

కావాలనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడు: జగన్
Follow us on

గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ సీనియర్ నేతలు. టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. టీడీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. తమ కార్యకర్తలపై కూడా దాడులు చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారన్నారు. ఏపిలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాటు, ఈసీ పనితీరు, ఈవీఎంలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారని.. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని దుయ్యబట్టారు.

పోలింగ్ బూత్‌లోపలికి వెళ్లి కోడెల తలుపులు వేసుకున్నారు.. ఆయనే కావాలని చొక్కా చింపుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. అసలు కోడెల లోపలికి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి..? ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు జగన్. అలాగే.. తమ ఓటు ఇతరులకు పడిందని ప్రజలు ఎక్కడా..  ఫిర్యాదు చేయలేదని.. కావాలనే టీడీపీ నేతలు గొడవలు సృష్టించారన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో భద్రత కల్పించాలని కోరారు జగన్.