మెట్రోపై కేటీఆర్ కీలక ప్రకటన..!

హైదరాబాద్ మెట్రో సర్వీస్‌కు సంబంధించి.. కీలక ప్రకటన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తున్న మెట్రో రైలును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించడానికి కసరత్తులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిందని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే రాయదుర్గం స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత, అక్కడి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు […]

మెట్రోపై కేటీఆర్ కీలక ప్రకటన..!

Edited By:

Updated on: Aug 16, 2019 | 8:06 AM

హైదరాబాద్ మెట్రో సర్వీస్‌కు సంబంధించి.. కీలక ప్రకటన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తున్న మెట్రో రైలును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించడానికి కసరత్తులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిందని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే రాయదుర్గం స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత, అక్కడి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు ప్రారంభించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.