కోపమొచ్చింది.. ఏ చేయాలో తెలియలేదు.. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు.. తనకు తోచినట్లుగా చేస్తుంటారు కొందరు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. ఓ పెద్దావిడ తమ ఇంటి ముందు నిలిచిన బైక్‌ను కూరగాలు కోసే కత్తితో కసితీర కోసిపడేసింది. అయితే ఈ సీన్ మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. కోపంతో రావడం.. ఇంటి పక్కన నిలిపిన బైక్‌ను కత్తితో కోసేయడం అంతా మూడో కంటికి చిక్కింది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో నెటిజన్లు మాత్రం పెద్దావిడకు సపోర్టుగా నిలుస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం.
ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తావా అంటూ యజమానురాలు కూరగాయాల కత్తితో బైక్ సీటును కోసేసిన ఘటన పాతబస్తీ కామాటిపురా పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త సి.సి కెమెరాలో నిక్షిప్తం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలలోకి వెళితే పాతబస్తీ దూద్బౌళి ప్రాంతంలో వర్షం కురుస్తుండడం…
తన ఇంటి ముందు విద్యుత్ స్తంభం ఉన్న కారణంగా స్థానికుడు తన బైక్‌ను పక్కింటి ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. దీంతో నా ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తావా ? అని ఆగ్రహించిన సదరు ఇంటి యజమానురాలు కత్తితో అతని బైక్ సీటును కోసేసింది. ఈ ఘటన సి.సి కెమెరాలో నిక్షిప్తంగా కావడం … ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కామాటి పురా పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం