Fire Accident: గాఢనిద్రలో ఉండగా మంటలు.. చార్మినార్‌ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి?

Charminar Fire Accident ప్రమాదం కచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే 6 గంటలకు ప్రమాదం జరిగితే 15నిమిషాల్లోపే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నా.. పాత భవనం కావటంతో సహాయకచర్యలకు అక్కడి పరిస్థితులు సహకరించలేదంటున్నారు. స్పాట్‌కి చేరుకున్న కేంద్రమంత్రి..

Fire Accident: గాఢనిద్రలో ఉండగా మంటలు.. చార్మినార్‌ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి?

Updated on: May 18, 2025 | 1:30 PM

కింద షాపులు.. పైన ఇల్లు.. రావడానికీ పోవడానికీ ఒకే దారి. ఎన్నో ఏళ్లుగా అక్కడే వ్యాపారం. అక్కడే నివాసం. ఇన్నేళ్లూ ఏమీ జరగలేదు. ఎప్పుడూ ఎవరూ ఎలాంటి ప్రమాదాన్నీ శంకించలేదు. కానీ అనుకోని దుర్ఘటన 17 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరికొందరిని ఆస్పత్రిపాలు చేసింది. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను శోకసముద్రంలో ముంచేసింది ఓల్డ్‌సిటీ ఫైర్‌ యాక్సిడెంట్‌.

ఉదయం 6 గంట లప్రాంతంలో జరిగిందీ ఘటన. అంతా గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టాయి. కిందున్న జ్యూయలరీ షాప్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ కంప్రెషర్‌ పేలటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏసీ కంప్రెసర్ పేలడం కారణంగానే ప్రమాదం జరిగినప్పటికీ పోలీసులు మరిన్ని కోణాలు విచారిస్తున్నారు. ప్రమాదానికి కంప్రెసర్ పేలడమే కారణమా? లేదా ఇంకేదైనా ఉందా అనేది దానిపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరుగగానే వెనుకున్న ఇళ్లకు కూడా పొగ కమ్మేసింది. ఇంట్లోకి వెళ్లేందుకు అగ్నిమాపకసిబ్బంది చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. దీంతో చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది.

స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రికి తరలించాక 14 మంది ఇలా మొత్తం 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు చికిత్సపొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో జ్యుయలరీ షాప్‌ నిర్వహిస్తున్నాడు వ్యాపారి. ఫస్ట్‌ఫ్లోర్‌లో కుటుంబం ఉంటోంది. వేసవి సెలవులకు వచ్చిన బంధువులు ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్నారు. నిచ్చెనల సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగలగొట్టి స్పృహకోల్పోయి ఉన్న కొందరిని అతి కష్టంమీద బయటికి తెచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం కచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే 6 గంటలకు ప్రమాదం జరిగితే 15నిమిషాల్లోపే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నా.. పాత భవనం కావటంతో సహాయకచర్యలకు అక్కడి పరిస్థితులు సహకరించలేదంటున్నారు. స్పాట్‌కి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. సహాయక చర్యలు ఆలస్యంపై బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు కేంద్రమంత్రి. ఫైర్‌సిబ్బంది దగ్గర ఆక్సిజన్‌ ఎక్విప్‌మెంట్‌ లేక వెంటనే బాధితులను కాపాడలేకపోయారన్నారు కిషన్‌రెడ్డి.

ప్రమాదం గురించి తెలియగానే ఫైర్‌సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సహాయకచర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. అనుకోని దుర్ఘటనను రాజకీయం చేయొద్దన్నారు పొన్నం.

ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి:

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి