Hyderabad Rain Alert: భాగ్యనగర (Bhagyanagaram) వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎండలనుంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తూ.. హైదరాబాద్‌లో వర్షాలు (Rains In Hyderabad) కురుస్తాయని తెలిపింది. నగరంలో మొస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ..ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరానికి ఉత్తరం, పడమర వైపు దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయని దీంతో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా నగరంలో అనేక ప్రాంతంలో ఇప్పటికే చిన్న చిన్న చినుకులతో వర్షం కురుస్తోంది. నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావు నగర్, మారెడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బేగంపేట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నారు.
Cooking Oil: పెరగనున్న పామాయిల్ ధరలు.. త్వరలోనే వంటింటికి కొత్త కష్టాలు.. కారణమేంటంటే..