Hyderabad: వంశీ వలలో 1000 మంది మహిళలు, యువతులు.. అతని ట్రాప్ ఫార్ములా ఏంటంటే

|

Jul 21, 2022 | 10:07 AM

సైబర్ చీటర్ వంశీ కృప్ణ గురించి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలుస్తున్నాయి. రిమాండ్‌లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad: వంశీ వలలో 1000 మంది మహిళలు, యువతులు.. అతని ట్రాప్ ఫార్ములా ఏంటంటే
Cyber Cheater Vamsi Krishna
Follow us on

Cyber Cheating: జోగాడ వంశీకృష్ణ.. మహిళలను ట్రాప్ చేయడంతో దిట్ట. ఎవరికి ఎలాంటి కథ చెప్పాలో అతడికి బాగా తెలుసు. ఈజీగా మోసం చేసేందుకు వీలుగా.. రెండోపెళ్లికి సిద్ధమైన మహిళలను టార్గెట్ చేస్తాడు. ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో వారికి వల వేస్తాడు. మాయమాటలతో ఈజీగా పడేస్తాడు. తూర్పు గోదావరి జిల్లా(East Godavari District) రాజమహేంద్రవరం(Rajamahendravaram)లోని రామచంద్రరావుపేటకు ఈ కేటుగాడ్ని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ కిలాడీ జాబ్ కోసం 2014లో భాగ్యనగరం వచ్చాడు. మొదట ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత 2016లో జాబ్‌ కన్సల్టెన్సీలో చేరాడు. జాబ్స్ ఇప్పిస్తానని పలువురని చీట్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు. జైలుకెళ్లి వచ్చాక.. తన పంథా మార్చాడు. హర్ష కూల్‌ 94, మాధురి చౌకి, గాయత్రి.. ఇలా పలు పేర్లతో ఫేక్ ఇన్ స్టా అకౌంట్స్ ఓపెన్ చేశాడు. తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకుని మహిళలతో చాట్ చేసేవాడు. ఈ ఫేక్ అకౌంట్స్ ద్వారా తనను తాను హైప్ చేసుకున్నాడు. సేవా కార్యక్రమాల పేరుతో మోసాలకు తెగబడ్డాడు. పరిచయమైన మహిళలు ఇబ్బంది ఉంది కావాలని అడిగితే.. దోచుకున్న డబ్బులో నుంచి ఒకటి లేదా 2 లక్షలు ఇచ్చేవాడు. దీంతో వారు కూడా అతడిని ఆకాశానికి ఎత్తేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో సుమారు 1000-1500 మంది యువతులు, మహిళలను మోసగించినట్లు  పోలీసులు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. వారి నుంచి రూ.40-50 కోట్లు గుంజినట్లు తెలుస్తోంది. నిందితుడి బ్యాంకు అకౌంట్లోని సుమారు రూ.4కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..