హక్కుల్ని కాలరాస్తున్నారు- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలకులు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా మానవ హక్కులనూ ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానించిన తీరు దారుణమని, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం దారుణమని విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం ఆయనకు నివాళులర్పించేందుకు కూడా సీఎం కేసీఆర్‌ రాకపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్‌ను టీఆర్‌ఎస్‌ అవమానించిన తీరును రాష్ట్ర ప్రజలు, దళిత సమాజం జాగ్రత్తగా గమనించాలని […]

హక్కుల్ని కాలరాస్తున్నారు- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Updated on: Apr 18, 2019 | 1:41 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలకులు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా మానవ హక్కులనూ ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానించిన తీరు దారుణమని, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం దారుణమని విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం ఆయనకు నివాళులర్పించేందుకు కూడా సీఎం కేసీఆర్‌ రాకపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్‌ను టీఆర్‌ఎస్‌ అవమానించిన తీరును రాష్ట్ర ప్రజలు, దళిత సమాజం జాగ్రత్తగా గమనించాలని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహన్ని ముక్కలుగా చేసి డంపింగ్‌ యార్డుకు తరలించడం లాంటి అమానవీయ, అప్రజాస్వామిక ఘటనలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతామని, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో కొండా వెంట ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తుందని చెప్పారు.