Telangana Rains: మళ్లీ వానలు.. సోమ, మంగళ వారాల్లో మోస్తరు వర్షాలు.. హైదరాబాద్ లో కుండపోత

| Edited By: Team Veegam

Aug 01, 2022 | 2:47 PM

ఇప్పటికే భారీ వర్షాలతో తడిసిముద్దయిన తెలంగాణకు (Telangana) మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఛతీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా...

Telangana Rains: మళ్లీ వానలు.. సోమ, మంగళ వారాల్లో మోస్తరు వర్షాలు.. హైదరాబాద్ లో కుండపోత
Telangana Rains
Follow us on

ఇప్పటికే భారీ వర్షాలతో తడిసిముద్దయిన తెలంగాణకు (Telangana) మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఛతీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి.. కొమరిన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని చెప్పారు. రుతుపవనాల సాధారణంగానే ఉన్నా వర్షాలు మాత్రం కురుస్తాయని పేర్కొన్నారు. కాగా.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం పడింది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కూకట్ పల్లి, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉండగా నిన్న కురిసిన వానతో ప్రజలు, ముంపు వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, జవహర్‌నగర్, దిల్ సుఖ్ నగర్, చాదర్​ఘాట్, మలక్​పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు అప్రమత్తాయి. రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అత్యధికంగా మామడ(నిర్మల్‌ జిల్లా)లో 5.7, మునిగడప(సిద్దిపేట)లో 5.4 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..